ఉద్యానం మేలు | - | Sakshi
Sakshi News home page

ఉద్యానం మేలు

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

2 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యం

ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు..

అధికారులను సంప్రదించాల్సిన నంబర్లు:

ప్రోత్సాహం బాగు..

జనగామ: వ్యవసాయ రంగంలో పంటల వైవిధ్యాన్ని పెంచుతూ రైతులకు అదనపు ఆదాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా పలు ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. సంప్రదాయ పంటల సాగుతో పాటు పండ్ల తోటలు, ఆయిల్‌పామ్‌, కూరగాయలు, పూలసాగు, పట్టుపరిశ్రమ వంటి రంగాలను ప్రోత్సహించేందుకు రాయితీలు కల్పిస్తోంది. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ రూపొందించిన ప్రణాళికలో వివిధ పథకాలకు నిధులు, సాగు విస్తీర్ణం, రైతులకు అందించే సబ్సిడీల వివరాలను పొందుపరిచింది.

24,334 ఎకరాల్లో ఉద్యాన పంటలు

జిల్లాలో 24,334 ఎకరాల్లో ఉద్యానవన పంటలు, 166.60 ఎకరాల్లో పట్టు పరిశ్రమ సాగులో ఉన్నా యి. ప్రధానంగా మామిడి 8,882 ఎకరాలు, ఆయిల్‌పామ్‌ 8,283.14 ఎకరాల్లో సాగు చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వివిధ పథకాలను అమలు చేస్తున్నారు.

డ్రిప్‌ పరికరాలపై 90 శాతం వరకు రాయితీ

పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌ పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల పరికరాల ఏర్పాటుకు రూ.8.83 కోట్ల బడ్జెట్‌తో 5,083 మంది రైతులకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ, ఎస్‌ఎఫ్‌, ఎంఎఫ్‌ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం రాయితీ కల్పి స్తారు. గిరిజన సబ్‌ప్లాన్‌ ప్రాంతాల్లోని రైతులకు 65 శాతం రాయితీ వర్తిస్తుంది. గరిష్టంగా 12.50 ఎకరాల వరకు అర్హత ఉంటుంది.

పండ్ల తోటలకు 40 శాతం సబ్సిడీ

సమగ్ర ఉద్యానవన అభివృద్ధి మిషన్‌ (ఎంఐడీహెచ్‌) కింద అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, జామ, డ్రాగన్‌ ఫ్రూట్‌, అవకాడో, విడి పూలు, దుంప, కొమ్ము, జాతి పూల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నారు. అరటికి హెక్టార్‌ యూనిట్‌ ధర రూ.1.75లక్షలు, బొప్పాయి హెక్టారుకు రూ.75వేలుగా నిర్ణయించారు. డ్రాగన్‌ ఫ్రూట్‌కు యూనిట్‌ ధర రూ.6.75 లక్షలు, మామిడి, నిమ్మ, జామ, అవకాడోకు రూ.1.25 లక్షల యూనిట్‌ వ్యయం నిర్ణయించారు. వీటిపై 40 శాతం రాయితీ ఉంటుంది.

పందిళ్ల నిర్మాణానికి రూ.50 వేల సాయం

పీఎం–ఆర్‌కేవీవై పథకం కింద శాశ్వత పందిళ్ల నిర్మాణానికి యూనిట్‌ వ్యయం రూ.లక్షగా నిర్ణయించా రు. ఇందులో ప్రభుత్వం 50 శాతం, అంటే రూ.50 వేలు సబ్సిడీగా అందిస్తుంది. ఒక రైతుకు గరిష్టంగా ఐదు యూనిట్ల వరకు అవకాశం ఉంది. 2026–27లో 20 హెక్టార్లలో పందిళ్ల నిర్మాణానికి రూ.70 లక్షల వ్యయంతో ప్రణాళిక రూపొందించారు.

పట్టుపరిశ్రమకూ..

మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం, పట్టు ఉత్పత్తుల ద్వారా రైతులకు ఉపాధి కల్పించేందుకు రాయితీలు అందిస్తున్నారు. 40 హెక్టార్ల మల్బరీ సాగు విస్తరణకు రూ.1.14 కోట్ల నిధులు కేటాయించారు. నర్సరీ, ఫారం నిర్మాణం, పరికరాల కొనుగో లు వంటి వాటికి వేర్వేరు వ్యయాలు, సబ్సిడీలు ని ర్ణయించారు. పట్టుగూళ్ల ఉత్పత్తిదారులకు కిలోకు రూ.75 చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు.

ఉద్యాన పంటలు వేసే రైతులకు భారీ రాయితీలు

ఆయిల్‌పామ్‌, పండ్ల తోటలు,

పట్టుపరిశ్రమకు ప్రత్యేక పథకాలు

జిల్లాలో 24,334 ఎకరాల్లో

పంటలు

డ్రిప్‌ నుంచి పందిళ్ల వరకు ఆర్థిక చేయూత

జాతీయ ఆయిల్‌పామ్‌ మిషన్‌ (ఎన్‌ఎంఈఓ–ఓపీ) కింద రూ.2.11 కోట్లతో 2 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 12 మండలాలకు లక్ష్యాలు కేటాయించారు. జనగామ, బచ్చన్నపేటలకు 200 ఎకరాల చొప్పున, పాలకుర్తి, రఘునాథపల్లిలకు 250 ఎకరాల చొప్పున లక్ష్యాలు నిర్దేశించారు. మిగతా మండలాలకు 100 నుంచి 200 ఎకరాల వరకు కేటాయించారు. మొక్కల సరఫరా, నాలుగు సంవత్సరాల నిర్వహణ సహా యం తదితర ప్రోత్సాహకాలు ఉన్నాయి.

రైతులు మీ సేవా కేంద్రం లేదా టీజీఎంఐపీ పోర్టల్‌ ద్వారా ఆధార్‌ ఓటీపీతో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌, పట్టాదారు పాస్‌బుక్‌, కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి. క్షేత్ర పరిశీలన అనంతరం అంచనా తయారీ, అడ్మినిస్ట్రేటివ్‌ సాంక్షన్‌, డ్రిప్‌ పరికరాల ఏర్పాటు, తనిఖీ, సబ్సిడీ విడుదల వంటి ప్రక్రియలు పూర్తవుతాయి.

డి.నరేష్‌.జిల్లా హార్టికల్చర్‌, సెరికల్చర్‌,

జనగామ–89777 14093

బి.సంతోషిరాణి, హార్టికల్చర్‌ అధికారి,

జనగామ నియోజకవర్గం–89777 14095

జె.రవికాంత్‌, హార్టికల్చర్‌ అధికారి,

పాలకుర్తి నియోజకవర్గం–89777 14115

కె.సందీప్‌, హార్టికల్చర్‌ అధికారి–

89777 14094

సీహెచ్‌ నవీన్‌పాల్‌రెడ్డి, సెరికల్చర్‌ అధికారి, జనగామ–99480 42131

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement