క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

జనగామ రూరల్‌: గెలుపు, ఓటమి కంటే క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు చదువులో రాణించేందుకు దోహదపడుతాయని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా చెప్పా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ స్టేడియంలో చేపట్టిన జిల్లా స్థాయి కలెక్టర్‌ కప్‌–2026 ఇండోర్‌ గేమ్స్‌ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..క్రీడలు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. జాతీయ స్థాయిలో రాణించడం వల్ల భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం అండర్‌–14, అండర్‌–17 బాలురు, బాలికల విభాగాల్లో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.10,000 నగదు, కప్‌, ద్వితీయ బహుమతిగా రూ.6,000 నగదు, కప్‌, తృతీయ బహుమతిగా రూ.4,000 నగదు, కప్‌, అలాగే ప్రశంసపత్రాలను అందజేశారు. అదే విధంగా పోటీల్లో పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడికి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ను అందించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్‌, డీవైఎస్‌ఓ నరసింహారావు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి గోర్‌ సింగ్‌, జీసీడీఓ గౌసియా బేగం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజర్‌ రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతల వివరాలు:

చెస్‌ విభాగంలో బాలబాలికల అండర్‌–14,విభాగంలో మొదటి స్థానంలో ఎన్‌.దయామణి లింగాలఘణపురం ఎంపీయూపీఎస్‌ నేలపోగుల, క్యారమ్స్‌ బాలబాలికల అండర్‌–14,17 విభాగంలో మొదటి స్థానంలో ఎన్‌.అక్షిత, కేజీబీవీ చిల్పూర్‌, క్యారమ్స్‌ – అండర్‌–17 బాలురు, ఎస్‌.రేవంత్‌, జెడ్పీఎస్‌ఎస్‌, నర్మెట, క్యారమ్స్‌ – అండర్‌–17 బాలికలు: జె. అంజలి జెడ్పీఎస్‌ఎస్‌ నర్మెట, క్యారమ్స్‌ – అండర్‌–14 బాలురు: బి. రోహిత్‌, మోడల్‌ పాఠశాల బచ్చన్నపేట, క్యారమ్స్‌ – అండర్‌–14 బాలికలు: డి.సాయిశ్రీ, జెడ్పీఎస్‌ఎస్‌ మాధాపురం, దేవరుప్పుల, టేబుల్‌ టెన్నిస్‌ – అండర్‌–17 బాలురు: డి. చరణ్‌ సాయి, మోడల్‌ పాఠశాల చౌడారం, జనగామ, టేబుల్‌ టెన్నిస్‌ – అండర్‌–17 బాలికలు: జి. అక్షయ, పోచన్నపేట, బచ్చన్నపేట, టేబుల్‌ టెన్నిస్‌ – అండర్‌–14 బాలురు: ఎస్‌. ప్రదీప్‌, జెడ్పీఎస్‌ఎస్‌ చిన్నమడూర్‌, దేవరుప్పుల, టేబుల్‌ టెన్నిస్‌ – అండర్‌–14 బాలికలు: కె. సంజన, జెడ్పీఎస్‌ఎస్‌ పోచన్నపేట, బచ్చన్నపేట, చెస్‌ – అండర్‌–17 బాలురు: సీహెచ్‌. రితేష్‌ రెడ్డి, సాన్‌ మారియా, జనగామ, చెస్‌ – అండర్‌–17 బాలికలు: బి.సాన్వి, సాన్‌ మారియా, జనగామ, చెస్‌ – అండర్‌–14 బాలురు: వై. చాణక్య యాదవ్‌, ఆర్యభట్ట హైస్కూల్‌, జనగామ, చెస్‌ – అండర్‌–14 బాలికలు: కె. సహస్ర, నారాయణ, జనగామ, బ్యాడ్మింటన్‌ – అండర్‌–14 బాలురు: సీహెచ్‌. హర్షవర్ధన్‌, ఎంజేపీ జనగామ, బ్యాడ్మింటన్‌ – అండర్‌–14 బాలికలు: జె. నైనిక, ఏకశిల పబ్లిక్‌ స్కూల్‌, జనగామ, బ్యాడ్మింటన్‌ – అండర్‌–17 బాలురు:బి.తేజస్విన్‌, న్యూ క్రియేషన్‌, జనగామ, బ్యాడ్మింటన్‌ – అండర్‌–17 బాలికలు:సీహెచ్‌. అక్షయ, న్యూ క్రియేషన్‌, జనగామ, యోగా అండర్‌–14 బాలుర విభాగంలో బచ్చన్నపేట మోడల్‌ పాఠశాల విద్యార్థి జి. ప్రణయ్‌ మొదటి స్థానం, యోగా అండర్‌–14 బాలికల విభాగంలో బచ్చన్నపేట కేజీబీవీ విద్యార్థిని ఎస్‌. సంకీర్తన మొదటి స్థానం,యోగా అండర్‌–17 బాలుర విభాగంలో జనగామ పీఎంశ్రీ పాఠశాల ధర్మకంచ విద్యార్థి ఇ. సంజయ్‌ మొదటి స్థానం, యోగా అండర్‌–17 బాలికల విభాగంలో జఫర్‌గఢ్‌ కేజీబీవీ విద్యార్థిని ఎస్‌.ప్రసన్న మొదటి స్థానం సాధించారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

ఉత్సాహంగా కలెక్టర్‌ కప్‌ ఇండోర్‌ గేమ్స్‌ ముగింపు వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement