నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

జనగామ రూరల్‌: జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాలతో రద్దు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావొద్దని ఆయన సూచించారు.

కేంద్ర సంక్షేమ పథకాలు

ప్రజలకు చేరేలా చూడాలి

జనగామ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా చూడాలని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి సూచించారు. ఆదివారం హన్మకొండ పర్యటనలో భాగంగా పట్టణంలోని నాగర్‌ కర్నూల్‌ ఇన్‌చార్జ్‌ కేవీఎల్‌ఎన్‌ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలను కలిసి పార్టీ సంస్థాగత విషయాలను చర్చించారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసే విధంగా దశలవారీ కార్యక్రమాలను చేపట్టి ఐక్యంగా పార్టీ ఎదుగుదలకు తోడ్పాడలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి దశమంత్‌ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్‌ రెడ్డి, శివరాజ్‌ యాదవ్‌, ఉడుగుల రమేశ్‌, సుధీర్‌ అంజన్‌, దేవరాయ ఎల్లయ్య, కొంతం శ్రీనివాస్‌, పెద్దోజు జగదీశ్‌, వెంకటేశ్వర్లు, పవన్‌ శర్మ, బొమ్మకంట అనిల్‌, తోకల హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

హిందూ చైతన్యమే

విశ్వకల్యాణానికి మార్గం

జనగామ: విశ్వహిందూ పరిషత్‌ దేశవ్యాప్తంగా చేపట్టిన హిందూ హితచింతక్‌ అభియాన్‌ సభ్య త్వ నమోదు కార్యక్రమం ఆదివారం జిల్లాలో ప్రారంభమైంది. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, అ నంతరం నర్మెట, తరిగొప్పుల మండలాల్లో నా యకులు పర్యటించి సభ్యత్వ నమోదును ప్రో త్సహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మండలాల్లో కార్యకర్తలు ఒకేసారి సభ్యత్వ న మోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ.. హిందువుల సంఘటిత శక్తి, చైతన్యమే విశ్వకల్యాణానికి మార్గమని అన్నారు. కార్యక్రమంలో విభాగ్‌ సంఘటన మంత్రి శివరాములు, జి ల్లా ఉపాధ్యక్షుడు బచ్చు బాలనారాయణ, సహాయ కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్‌, భజరంగ్‌ దళ్‌ జిల్లా కన్వీనర్‌ దుడుక సాయితేజ, రఘునాథపల్లి మండల అధ్యక్షుడు లింగంపల్లి కిషన్‌ రావు, మండల హిందూ ప్రముఖులు పడకంటి రవీందర్‌, అంబటి బాలరాజు, వెంకటేశ్వర్లు, పరిషత్‌ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జీఓ 25ను

రద్దు చేయాలి

జనగామ రూరల్‌: జీఓ 25ను రద్దు చేసి ప్రతీ ప్రాథమిక పాఠశాలకు, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలో సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో ఆదివారం జిల్లా మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ.. ఇంటర్‌ బోర్డ్‌ను రద్దుపరుస్తామని ప్రకటించేకంటే ముందు అందరితో చర్చించి సాధ్యాసాధ్యాలను తెలుసుకుంటే బాగుండేదన్నారు. మహాసభలో రాష్ట్ర కార్యదర్శులు సింహాచలం, రంజిత్‌ కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడూరి వెంకటేష్‌, రాష్ట్ర డైరెక్టర్‌ ఆకుల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మంగు జయప్రకాష్‌, హేమలత, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శులు కందుల శ్రీనివాస్‌, కృష్ణ, వసంత్‌ నాయక్‌, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్‌ సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి సింహాచలం ఎన్నికల అధికారిగా నూతన కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు పెచెట్టి చంద్రశేఖర్‌ రావు, ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్‌, ఉపాధ్యక్షులు పులి హిమబిందు, కందుల శ్రీనివాస్‌, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement