సోమేశ్వర క్షేత్రానికి కార్తీక శోభ | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వర క్షేత్రానికి కార్తీక శోభ

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

ఏర్పాట్లు పూర్తి

పాలకుర్తి టౌన్‌: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని క్షీరాద్రి శిఖరమైన పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింస్వామి క్షేత్రంలో ఈనెల 24 మంగళవారం అతిపెద్ద అఖండజ్యోతి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తిరువన్నామలై అరుణాచలం స్ఫూర్తితో పాలకుర్తి క్షీరగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ అనంతరం కొండపై ఏర్పాటు చేస్తున్న భారీ ప్రమిదలో ఒక టన్ను నువ్వుల నూనె, ఆవు నెయ్యి, 1 క్వింటాళ్ల ముద్ద కర్పూరంతో అతిపెద్ద అఖండజ్యోతి ఏర్పాటు చేశారు. పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దక్షిణ భారత దేశంలో మూడో అఖండజ్యోతి నిర్వహిస్తోంది. 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా రూపొందించిన దీపభాండాన్ని పాలకుర్తి శిఖరాగ్రవేదికపై ఏర్పాటు చేశారు. సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అఖండ జ్యోతి దర్శనం ప్రారంభానికి ముఖ్యఅతిథిలుగా మాతా అన్నపూర్దేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం పీఠాధిపతి, స్వామి దుర్గానందపురి మహారాజ్‌, స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హాజరు కానున్నారు.

24న కార్తీక పౌర్ణమి రోజున ఆలయంలో నిర్వహించే అఖండ జ్యోతి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అఖండజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

– భాగం లక్ష్మీప్రసన్న, ఆలయ ఈఓ,

రేపు క్షీరగిరిపై అఖండజ్యోతి

ముస్తాబైన సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement