నియోజకవర్గంలో విద్యారంగానికి రూ.300 కోట్లు | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గంలో విద్యారంగానికి రూ.300 కోట్లు

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: నియోజకవర్గంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని, ఒక్క విద్యారంగానికే మూడేళ్లలో రూ.300 కోట్లు నిధులు మంజూరు చేయించి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు తదితర రంగాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్దిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారని, ఏనాడు విద్యారంగంపై సమీక్షలు నిర్వహించలేదని ఆరోపించారు. డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నానని, అయితే ఏనాడు విద్యావ్యవస్థపై కేసీఆర్‌ ముందుకు సాగనివ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో హరీశ్‌రావుకు కేసీఆర్‌ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని, కేటీఆర్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే ప్రజల్లోకి వెళ్ళి సమస్యలపై పోరాడటానికి బదులుగా ఉనికిని చాటుకునేందుకు హరీశ్‌రావు రోజుకో ప్రెస్‌మీట్‌ పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఘన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాంబాబు, పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్‌రాజ్‌, నాయకులు బెలిదె వెంకన్న, బూర్ల శంకర్‌, పోశాల కృష్ణ, వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింహులు, కొలిపాక సతీష్‌, మేకల మల్లేశం, దశరథ్‌నాయక్‌, జానీబాబా, వెంకటేష్‌, పాతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement