మర్చిపోయిన బ్యాగు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

మర్చిపోయిన బ్యాగు అప్పగింత

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఓమహిళ తాను కూర్చున్న బెర్త్‌లో బ్యాగును మర్చిపోయి రైలుదిగగా సదరు బ్యాగ్‌ను ఘన్‌పూర్‌ పోలీసులు భద్రంగా అప్పగించారు. ఆది వారం ఎస్‌ఐ అరుణ్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని భీవండికి చెందిన ఆడెం సరిత, తన భర్త శ్రీనివాస్‌తో కలిసి వ్యక్తిగత పనులపై కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి జనగామకు వస్తున్నారు. జనగామ రైల్వేస్టేషన్‌లో దిగే క్రమంలో తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ ను రైలులోనే మర్చిపోయి దిగారు. రైలు కదిలాక బ్యాగ్‌ మర్చిపోయిన విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్‌కు ఫో న్‌ ద్వారా సమాచారం అందించగా ఆయన బ్లూకోల్ట్‌ సిబ్బంది మల్లేష్‌, నితిన్‌లను అప్రమత్తం చేశారు. వారు ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుని బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఆమెకు బ్యాగ్‌ అందించారు. అందులో రూ.4వేలు నగదుతో పాటు రోల్డ్‌గోల్డ్‌ నగలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement