బాలికలకు భరోసా.. | - | Sakshi
Sakshi News home page

బాలికలకు భరోసా..

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

మండలాల వారీగా వివరాలు..

‘మగువ’ పథకంతో ఆరోగ్య

రక్షణ చర్యలు

జనగామ: బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మగువ’ పథకం జిల్లాలో అమలుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలకే పరిమితమైన శానిటరీ ప్యాడ్ల పంపిణీ ఇకపై మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు అందుబాటులోకి రానుంది. ఆరోగ్యశాఖ, విద్యాశాఖ సంయుక్తంగా రూపొందించిన కార్యాచరణతో జిల్లాలోని 12 మండలాల పరిధిలో 162 పాఠశాలల బాలికలకు శానిటరీ ప్యాడ్లు సరఫరా చేయనున్నారు. మూడు నెలలకోసారి ఒక విడత చొప్పున ఏడాది పాటు పంపిణీ చేయడానికి ప్రణాళిక రూపొందించారు.

గతంలో పీఎం శ్రీ పాఠశాలలకే..

జిల్లాలోని 15 పీఎం శ్రీ పాఠశాలల్లో బడ్జెట్‌ అందుబాటులో ఉండడంతో అక్కడ చదువుతున్న బాలికలకు పాఠశాలలే గతంలో సొంతంగా శానిటరీ ప్యాడ్లు కొనుగోలు చేసి అందించేవి. అయితే మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. ఆర్థిక స్థోమత లేని విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండడంతో అవసరమైన అందరు బాలికలకు ఈ సౌకర్యం కల్పించేదిశగా ఆరోగ్య, విద్యాశాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా విద్యాశాఖ నుంచి పాఠశాలలు, బాలికల వివరాలతో నివేదిక కోరగా.. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 162 పాఠశాలల వివరాలను ఆరోగ్యశాఖకు అందించింది.

ఏడాదికి లక్షకు పైగా ప్యాడ్ల సరఫరా

విద్యాశాఖ నివేదిక ఆధారంగా ఆరోగ్యశాఖ పంపిణీ ప్రణాళిక రూపొందించింది. ప్రతీ మూడు నెలలకో సారి 26,151 చొప్పున, ఏడాదిలో నాలుగు విడతలుగా 1,04,604 శానిటరీ ప్యాడ్లను అందించనున్నారు. పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు షె డ్యూల్‌ ప్రకారం పంపిణీ చేయనున్నారు. పాఠశా ల విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన బాలికలకు నెలకు ఒక ప్యాక్‌ (ఎనిమిది ప్యాడ్లు) అందించాల్సి ఉంటుంది. పంపిణీ, నిల్వలు, విని యోగంపై అధికారులు పర్యవేక్షణ చేపట్టనున్నారు.

జిల్లాలో 162 పాఠశాలలకు

శానిటరీ ప్యాడ్లు

మూడు నెలలకోసారి పంపిణీ

గోప్యతకు ప్రాధాన్యం..

శానిటరీ ప్యాడ్ల పంపిణీ సమయంలో బాలికల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చూడాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. పాఠశాలల్లో ప్రత్యేక నో డల్‌ టీచర్లను నియమించి ప్యాడ్ల స్వీకరణ, నిల్వ, పంపిణీ వివరాలు రిజిస్టర్లలో నమోదు చేయాలి. ఎంఈఓలు, జిల్లా జెండర్‌ కో ఆర్డినేటర్లు రోజువారీ పంపిణీ వివరాలను పర్యవేక్షించాలి. కొరతలు, సరఫరాలో జాప్యం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి. బడ్జెట్‌ ఉన్న పాఠశాలలకే పరిమితమైన సౌకర్యాన్ని.. ఇతర ప్రభుత్వ పాఠశాలల బాలికలకూ విస్తరించడం ద్వారా రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహనతోపాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement