జనగామ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ బాలల సదనంలో నిర్వహించిన బాలల వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, ఆటల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పిల్లల సమగ్ర శ్రేయస్సు గురించి వివరించారు. చదువులో రాణిస్తూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేష్, సూపరింటెండెంట్ వెరోనికా, మమత, నివేదిక, చంద్రిక, మనమ్మ, కవిత, శ్రీలత, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ ప్రకాశ్, ప్రశాంత్, నరేష్, రంజిత్, కుమార్, అఖిల్, స్రవంతి, భార్గవి, వెన్నెల, శారద పాల్గొన్నారు.


