జనగామ రూరల్: ఎన్‌ఐ యాక్ట్‌పై శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్‌ల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని రాజీ మార్గంతో కేసులు లేకుండా చూసుకోవాలని తెలిపారు.
ఉపాధ్యాయుడు గణేష్‌కు అంతర్జాతీయ పురస్కారం
రఘునాథపల్లి: మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేష్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వరల్డ్ అలయన్స్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపాల్స్ సంస్థ ప్రకటించిన మెన్స్ డే అవార్డు–2026కు ఆయన ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా 55 మందిని ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి ఆరుగురికి ఈ గౌరవం దక్కింది. మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గణేష్.. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాల పెంపు, పోటీ పరీక్షలకు మార్గదర్శకత్వం, వినూత్న బోధనా పద్ధతుల ద్వారా విద్యారంగంలో విశేష కృషి చేస్తున్నారు. నవంబర్ 19న ఆన్‌లైన్ సమావేశంలో ద్వారా అవార్డును ప్రకటించగా.. సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ దీప్ శిఖా పాఠక్, తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ తృప్తిఓరా కు గణేష్ కృతజ్ఙతలు తెలిపారు.
గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గం ఎన్నిక
జనగామ: జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం కార్యనిర్వాహక కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం ఉపాధ్యక్షు డు ఏ.జగన్మోహన్‌రావు, కార్యదర్శి కోల రాజేష్ హాజరు కాగా.. ఈ సందర్భంగా 2027 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా నీలం కొర్నేలియస్, సహ అధ్యక్షుడిగా జె.సునీల్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా డి.సారంగపాణి, కోశాధికారిగా ఎండీ గౌస్ ఎన్నికయ్యా రు. ఉపాధ్యక్షులుగా పి.జైపాల్‌రెడ్డి, డి.అశోక్‌రెడ్డి, కె.అరుణ, కె.కమల, సహాయ కార్యదర్శులుగా పి.మనోహిత్, విక్రమ్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రవికిరణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం బాధ్యతలు, సంఘం బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా 2027 సంవత్సరానికి డైరీ, క్యాలెండర్ రూపకల్పన, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యత్వ నమోదు, సభ్యుల భాగస్వామ్యం పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
పాలకుర్తి టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సీజీఆర్‌ఎఫ్ (వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక ) పని చేస్తుందని టీజీఎన్పీడీసీఎల్ సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ డాక్టర్ మాధవరావు అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ సబ్‌డివిజన్ కార్యాయలంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పాలకుర్తి, పాలకుర్తి రూర ల్, కొడకండ్ల మండలాల పరిధిలోని విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కొత్త సర్వీసులు, మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను వినియోగదారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 12 ఫిర్యాదులు పరిశీలించిన చైర్మన్.. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూ చనలు చేశారు. సమస్యలు పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని, నిరంత విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఇదిలా ఉండగా.. విద్యత్ షాక్‌తో మృతి చెందిన మహిళ కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున విడుదలైన రూ.8 లక్షల పరిహారం చెక్కును చైర్మన్ మాధవరావు బాధిత కుటుంబానికి అందజేశారు. శాతాపురం గ్రామానికి చెందిన రాగిరి అనిత దండెంపై దుస్తులు ఆరేస్తూ విద్యుదాఘాతంతో మృతిచెందగా విద్యుత్ శాఖ నుంచి పరిహారం అందించారు. సత్యనారాయణ, ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, ఎస్‌ఏఓ శంకర్, డీఈ సారయ్య, ఏడీ శ్రీధర్, ఏఏఓ శేఖర్, ఏఈలు రణథీర్, రాకేష్, రామకృష్ణ, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


