ప్రతీ కుటుంబానికి ‘ఇందిరమ్మ’ బీమా | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కుటుంబానికి ‘ఇందిరమ్మ’ బీమా

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

జనగామ: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిర మ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా తెలిపారు. జనగామ మున్సిపాలిటీ పరిధి 22వ వార్డు పరిణయ కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కుటుంబ యజ మాని అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి పథకం ద్వారా రూ.5లక్షల బీమా ప్రయోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు. 22వ వార్డులో నివసిస్తున్న కుటుంబాల వివరాలను మున్సి పల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్న కలెక్టర్‌, నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రతీ ఒక్కరి వివరాలను రిజిష్టర్లలో నమోదు చేసి వారి సంతకాలు తీసుకోవాలన్నారు. ఆధార్‌, మొబైల్‌ నంబర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. నమోదైన సమాచారాన్ని లబ్ధిదారులకు చదివి వినిపించి, తప్పులు లేకుండా ధ్రువీకరించుకోవాలన్నారు. ప్రజలకు టోకెన్లు జారీ చేయాలని, డేటా నమోదైన వివరాలను ఎప్పటికప్పుడు భద్రపరచాలని అధికా రులకు సూచించారు. నమోదు ప్రక్రియకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బాలమణి మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈ ఓ బాలరామరావు, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ కుటుంబ బీమాతో ఆర్థిక భరోసా

జనగామ రూరల్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో ఆర్థిక భరోసా కలుగుతుందని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. జనగామ మండలంలోని ఓబుల్‌ కేశవాపురం జీపీ ఆవరణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం ఆయ న ప్రారంభించి, మాట్లాడారు. 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న కుటుంబ సభ్యుల పేరు మీద బీమా తీసుకునే అవకాశం ఉందని తెలి పారు. పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్‌ కార్డులో ఉన్న తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారని, క్యాంపుల కు వచ్చే ముందు తప్పనిసరిగా తమ ఆధార్‌ కార్డు ను వెంట తీసుకురావాలని సూచించారు. ప్రతి కు టుంబానికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రైతు బీమాతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీమా ద్వారా వచ్చే మొత్తాన్ని ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని తెలి పారు. గ్రామ పంచాయతీలో నిర్దేశించిన వ్యవధి లోపు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. క్యాంపులకు తరలి వచ్చే లబ్ధిదారులకు తగిన వసతులు క ల్పించాలని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇది లా ఉండగా.. ఓబుల్‌ కేశవాపురంలో డ్రెయినేజీ, రోడ్లు, పాఠశాలల మరమ్మతులు, విద్యుత్‌, తాగునీటి సమస్యల పరిష్కారానికి దాదాపు రూ.2 కోట్ల 95 లక్షలు మంజూరు చేసినందున సర్పంచ్‌ జనార్దన్‌ రెడ్డి కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జెడ్పీ సీఈఓ బలరామరావు, డీఆర్డీఓ రాపర్తి భాస్కర్‌, ఎంపీడీఓ మహేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement