మండలాల వారీగా అందాల్సిన వేతనాలు(రూ.లక్షల్లో)
రఘునాథపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జూన్ లో పని చేసిన కూలీలకు ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కష్టపడి చేసినా.. సకాలంలో డబ్బులు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రారంభమైన వీబీ జీ రామ్‌జీ పథకం కింద చేస్తున్న పనులకు వారానికోసారి వేతనాలు జమ అవుతున్నాయని, కానీ గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసిన మూడు నుంచి నాలుగు వారాలకు సంబంధించిన పనులకు మాత్రం ఇప్పటికీ బకాయిలు విడుదల కాలేదని వాపోతున్నారు. దీంతో పాత బకాయిలు ఎప్పుడు వస్తాయో తెలియక కూలీలు నిత్యం ఫీల్ట్ అసిస్టెంట్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూలీలకు సుమారు రూ 5.30 కోట్ల వరకు వేతన బకాయిలు అందాల్సి ఉంది. అలాగే జూన్‌లో చేసిన ఇందిరమ్మ ఇంటి పనులకు సంబంధించిన డబ్బులు కూడా ఇప్పటికీ రాలేదని పలువురు కూలీలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈజీఎస్ పనుల డబ్బులు విడుదల చేయాలని కూలీలు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో రాలేదు.
బచ్చన్నపేట 25.18
చిల్పూరు 16.97
దేవరుప్పుల 7.96
స్టేషన్‌ఘన్‌పూర్ 76.65
జనగామ 40.99
కొడకండ్ల 14.46
లింగాలఘణపురం 95.14
నర్మెట 40.05
పాలకుర్తి 31.13
రఘునాథపల్లి 48.42
తరిగొప్పుల 3.98
జఫర్‌గఢ్ 1.36 కోట్లు
జిల్లాలో రూ.5.30 కోట్లు పెండింగ్
వీబీ జీ రామ్‌జీ కొత్త పథకంలో వారానికోసారి వేతనాలు
ఉపాధి హామీలో చేసిన పనులకు అందని డబ్బులు
పట్టించుకోని అధికారులు


