● రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
● వరంగల్‌లో 7వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం
వరంగల్ హంటర్ రోడ్డులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ క్రీడామైదానంలో 7వ తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం హాకీ టోర్నమెంట్ ప్రారంభమైంది. రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
– ఖిలా వరంగల్


