జనగామ రూరల్: విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని శాసీ్త్రయ దృక్పథాన్ని అలవార్చుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఏఐకేఎస్, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్తంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానం, డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించగా.. రాజమహేంద్ర నాయక్ మాట్లాడారు. విద్యార్థులు డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజం తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. కార్యక్రమంలో భూక్య చందు నాయక్, రాపర్తి రాజు, మమత, రాపర్తి సోమయ్య, సాంబరాజు, యాదగిరి, మహమ్మద్ అజారుద్దీన్, పొదల లవకుమార్ పాల్గొన్నారు.
డీసీపీ రాజమహేంద్ర నాయక్


