జనగామ రూరల్:గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మారుజోడు రాంబాబు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ముగింపు సమావేశం నిర్వహించారు. సరస్వతిదేవి చిత్రపటానికి పూలమాల వేసి న అనంతరం రాంబాబు మాట్లాడారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి, విద్యార్థులకు అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయని తెలి పారు. సమయాన్ని వృథా చేసుకోకుండా చదవుకు ని భవిష్యత్లో స్థిరపడాలని సూచించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కౌన్సిలర్ శ్రీమతి వంగా ఉమ, నీరటి రజని, గ్రంథాలయ అధికారి మధుసూదన్ రెడ్డి, గ్రంథపాలకులు సీహె చ్ రవి, పద్మారావు, ధనలక్ష్మి, లింగాల జగదీశ్ చందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మోహన్రావు, నీరటి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు


