మైనారిటీ అభ్యర్థులకు ఉచిత గ్రూప్స్‌ కోచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

మైనారిటీ అభ్యర్థులకు ఉచిత గ్రూప్స్‌ కోచింగ్‌

Nov 19 2026 12:55 AM | Updated on Nov 19 2026 12:55 AM

జనగామ: ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌ మంచి అవకాశంగా నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీస్‌ స్టడీ సర్కిల్‌ అండ్‌ కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ (టీజీఎంఎస్‌సీ–సీసీసీ) ద్వారా టీజీపీఎస్సీ గ్రూప్‌–2, గ్రూప్‌–3 పరీక్షలకు ఉచిత ప్రాథమిక ఫౌండేషన్‌ కోచింగ్‌ అందించనున్నారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సీ, బౌద్ధ మైనారిటీ వర్గాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గ్రూప్‌–2 కోచింగ్‌కు 100 మంది, గ్రూప్‌–3 కోచింగ్‌కు 100 మంది చొప్పున మొత్తం 200 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు.

26వ తేదీ చివరి గడువు

దరఖాస్తుల స్వీకరణ ఈ నెల17న ప్రారంభమైంది. 26 చివరి తేదీ కాగా, 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, డిజిటల్‌ స్కానింగ్‌ కోసం ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు, ఒక పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో సమర్పించాలి.

రిజిస్ట్రేషన్‌ కేంద్రం

తెలంగాణ మైనారిటీస్‌ స్టడీ సర్కిల్‌, ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణం, ఎంఏఎం క్యాంపస్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు వెనుక, శ్రీ బాలాజీ ఎన్‌న్‌క్లేవ్‌, గోషామహల్‌, నాంపల్లి, హైదరాబాద్‌–500001. మరిన్ని వివరాలకు పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040–2323611 2, 9059050062 నంబర్లతో పాటు ఈ–మెయిల్‌ directorsmccctelan gana@gmail.com.లో సంప్రదించవచ్చు.

గ్రూప్‌–2, గ్రూప్‌–3 పరీక్షలకు ఫౌండేషన్‌ శిక్షణ

200 మందికి అవకాశం

ఈ నెల 26 వరకు దరఖాస్తులు

ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభం

సద్వినియోగం చేసుకోండి

మైనారిటీ వర్గాలకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఈ ఉచిత కోచింగ్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోటీ పరీక్షలకు పటిష్టంగా సిద్ధమయ్యేందుకు ఫౌండేషన్‌ శిక్షణ ఉపయోగపడుతుంది. ప్రైవేటు కోచింగ్‌ కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హులైన వారు ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల సాధన దిశగా ముందడుగు వేయాలి.

– మురళీధర్‌రావు,

మైనారిటీ సంక్షేమ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement