జనగామ రూరల్: ప్రతీ కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించే సమయంలోనే జిల్లా వ్యాప్తంగా అంతటా ఒకేసారి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, దరఖాస్తుల సేకరణ, ప్రజలకు అవగాహన కల్పించడం, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19న సిద్దిపేట జిల్లా నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని పథకాన్ని ఒకేసారి పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ (నోడల్ అధికారి) బలరామ రావు తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఓటరు జాబితా
పకడ్బందీగా పూర్తిచేయాలి
పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితాల నూతన రూపకల్పన ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్ కుమార్ దాస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజక వర్గాల ఓటరు జాబితాల నూతన రూపకల్పన ప్రక్రియ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్ నుంచి అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. వీసీలో ఆర్డీఓ గోపీరాం, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు


