నర్మెట: అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని, ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, కొత్త పింఛన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలవేనని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం నూతన పింఛన్లు అందించిన అనంతరం వారు మాట్లాడారు.. ఫోర్ వీలర్ యజమానుల నిబంధనలను సవరించి ట్రాక్టర్లను, స్వయం ఉపాధి పొందుతున్న వారిని మినహాయించి వారికీ పింఛన్లు అందించాలన్నారు. మండలానికి 423 నూతన పింఛన్లు ఇరువురు కలసి అందించగా, అనంతరం కళ్యాణలక్ష్మి 22 చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కలకుంట్ల వెంకట రామానుజాచార్యులు, ఎంపీడీఓ చిదురాల సుమన్, సూపరింటెండెంట్ సత్యవాణి, డీటీ కురికాల వేణు, సర్పంచ్‌లు గోపగోని శ్రీధర్ గౌడ్, కంతి అంజనేయులు, పగిడిపాటి రాజు, మౌనిక లక్పతి, అరుణా సంతోష్, రేఖ బాపురాజు,కుమార్, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి బాధ్యత లేదా?
‘రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వానికి బాధ్యత లేదా? రైతుల కన్నీళ్లకు ఎవరిది బాధ్యత...?బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులను తక్షణమే ఆదుకోవాలి’ అని ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ చేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఆగాపేట మహిళాౖ రెతు మెట్టు ఉప్పలమ్మ కుటుంబాన్ని పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించిన ఆయన రూ.25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్ర నాయకులు గద్దల నర్సింగారావు, సర్పంచ్ పగిడిపాటి రాజు, ఉప సర్పంచ్ సొక్కం అనిల్ కుమార్, మండల శాఖ అధ్యక్షుడు చింతకింది సురేష్, ఉమ్మడి మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, మెడబోయిన రాజు, తాజా మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి


