ఉత్సాహంగా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శన

Nov 19 2026 12:55 AM | Updated on Nov 19 2026 12:55 AM

● రాష్ట్రస్థాయికి 4 ప్రాజెక్ట్‌ల ఎంపిక

జనగామ రూరల్‌: విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాలను వెలికిదీసేలా, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు జిల్లాలో 32వ నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 2026 ప్రదర్శన పోటీలు బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మార్గదర్శకాల అనుగుణంగా ఈ సైన్‌న్స్‌ కాంగ్రెస్‌ పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు మూడు నెలల క్రితం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోగా బుధవారం తమ ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. సుస్థిరత కోసం విజ్ఞానం, ఆవిష్కరణలు ఇతివృత్తంగా పోటీలు నిర్వహించా రు. వ్యర్థాల నిర్వహణ, శక్తి వనరులు, నీటి విని యోగం సేకరణ, సరక్షణ, వ్యవసాయం, వైద్యం వంటి అంశాలపై విద్యార్థులు ప్రాజెక్ట్‌లు ప్రదర్శించారు. ఎన్‌సీఎస్సీ వెబ్‌సైట్‌లో 83 ప్రాజెక్ట్‌లు నమోదు చేసుకోగా జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి 4 ప్రాజెక్ట్‌లను ఎంపిక చేశామని జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ ఉపేందర్‌ తెలిపారు. ఏడీ బొమ్మనబోయిన శ్రీనివాస్‌ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు..జె.సాత్విక, జెడ్పీఎస్‌ఎస్‌ సింగరాజుపల్లి, జి.సాకేత్‌, మోడల్‌ పాఠశాల కొడకండ్ల, అచ్యుత్‌, జెడ్పీఎస్‌ఎస్‌ మల్కాపూర్‌, ఆర్‌.శాన్వి, కార్మెల్‌ కాన్వేట్‌ స్కూల్‌ పాలకుర్తి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement