లింగాలఘణపురం: మండలంలోని నవాబుపేట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలోని అంగడి పశువుల క్రయవిక్రయాలకు సంబంధించి రహాదారుల వేలం పాటలో రూ.72,51,000 ఆదాయం వచ్చినట్లు ఈఓ లక్ష్మిప్రసన్న తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన బహిరంగ వేలం పాటలో నర్సంపేటకు చెందిన పాలకుర్తి ప్రభాకర్ వేలం దక్కించుకున్నట్లు ఈఓ వివరించారు. వేలం పాట దేవాదాయ ఇన్‌స్పెక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో జరుగగా సర్పంచ్ సదానందం, జూనియర్ అసిస్టెంట్ రాజేందర్‌రెడ్డి, రవితేజ, వసంత, ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో రెండుసార్లు వేలం నిర్వహించగా పాటదారులు రాకపోవడంతో వాయిదా పడగా గత ఏడాది పాట రూ.72,50,000 కాగా అదనంగా కేవలం రూ.1000లు అంటే రూ.72,51,000 మాత్రమే రావడం జరిగింది. రోజురోజుకూ అంగడిలో పశువుల క్రయవిక్రయాలు తగ్గుతుండడంతో రహదారుల వేలం పాటకు కాంట్రాక్టర్లు రావడంలేదు.


