నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

● ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి

దేవరుప్పుల: పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్‌ రాజీలేని చర్యలు చేపడుతోందని ఆ శాఖ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం రాత్రి జనగామ డివిజన్‌ పరిధి సింగరాజుపల్లి సెక్షన్‌లోని 33/11 కేవీ పరిధి నీర్మాల సబ్‌స్టేషన్‌లో అదనంగా ఏర్పాటు చేసిన 3.15 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంపత్‌రెడ్డి మాట్లాడుతూ.. అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ అందుబాటులోకి రావడంతో సబ్‌స్టేషన్‌ పరిధిలో ఓవర్‌లోడ్‌ సమస్యలు తొలగిపోయి, మెరుగైన విద్యుత్‌ సరఫరాకు వీలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఈలు లక్ష్మీనారాయణ రెడ్డి, విజయ్‌ (ఎంఆర్‌టీ), ఏడీఈలు వేణుగోపాల్‌ (ఆపరేషన్‌), శ్రీనివాస్‌ (ప్రొటెక్షన్‌), ఏఈలు నర్సింహులు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement