వైభవంగా గోపాష్టమి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా గోపాష్టమి వేడుకలు

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

జనగామ: గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మంగళవారం విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో గోమాత పూజలు వైభవంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌, గోసేవా విభాగ్‌, మాతృశక్తి సభ్యులు గోవులను పసుపు, కుంకుమ, పూలమాలలతో అలంకరించి ధూపదీప నైవేధ్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పరిషత్‌ అధ్యక్షుడు ఎనగందుల భిక్షపతి మాట్లాడుతూ.. గోమాతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పరిషత్‌ కార్యదర్శి, ఆధ్యాత్మిక తత్వవేత్త డాక్టర్‌ మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు గోసేవ, గోరక్షణ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పిన రోజుగా గోపాష్టమిని జరుపుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పరిష త్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చు బాలనారాయణ, కోశాధికారి దిడిగం లక్ష్మణ్‌, పట్టణ అధ్యక్షుడు అంబటి బాలరాజు, సభ్యులు, భజరంగ్‌ దళ్‌ ప్ర తినిధులు, గోసేవకులు, భక్తులు పాల్గొన్నారు.

నషా ముక్త్‌ భారత్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా దొంతుల శేఖర్‌

జనగామ: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలోని నషా ముక్త్‌ భారత్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా జనగామ పట్టణానికి చెందిన దొంతుల శేఖర్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు శివ ప్రతాప్‌ శుక్లా సమక్షంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సొసైటీ సమావేశంలో ఈ నియామకాన్ని రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాన కిషోర్‌ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం జరిగిన వేడుకల్లో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా దొంతుల శేఖర్‌ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కరాటే పోటీల్లో అభిరామ్‌రెడ్డి ప్రతిభ

బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్‌ గ్రామానికి చెందిన గూడ లక్ష్మి–శ్రీనివాస్‌రెడ్డి దంపతుల కుమారుడు అభిరామ్‌రెడ్డి(7వ తరగతి) కరాటేలో ప్రతిభ కనబర్చి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో నిర్వహించిన 5వ ఇన్విటేషనల్‌–2026 ఓపెన్‌ కరాటే పోటీల్లో అభిరామ్‌ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నీల కవితమురళి, గ్రామస్తులు అభిరామ్‌రెడ్డిని అభినందించారు.

విద్యార్థుల నైపుణ్యాల

పెంపునకు పాటుపడాలి

● జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అఽధికారి శ్రీనివాస్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: విద్యార్థులు విజయాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు పాటుపడాలని విద్యాశాఖ జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌ సూచించారు. మండలంలోని మీదికొండ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, మండల పరిషత్‌ పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులో భిన్నమైన ఆలోచన ధోరణిని పెంపొందించేలా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ కె.రమేశ్‌, ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం రత్నాకర్‌, సునీత, నర్మదాభాయ్‌, కుమారస్వామి, ఉషారాణి, లక్ష్మారెడ్డి, సీఆర్‌పీ లవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement