● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పింఛన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పురపాలిక చైర్‌పర్సన్ బాలమణిశ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిబంధనల పేరుతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
చీటకోడూర్‌లో..
జనగామ రూరల్: మండలంలోని చీటకోడూర్ రైతు వేదికలో 21 గ్రామాలకు చెందిన నూతన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే పల్లా ఉత్తర్వుల కాపీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, ఎంపీడీఓ మహేష్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పింఛన్లు
బచ్చన్నపేట: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కల వారందరికీ పింఛన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . నియోజకవర్గ పరిధిలో కొత్తగా సుమారు 863 పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లావణ్య, తహసీల్దార్ హుస్సేన్, సర్పంచ్‌లు, నాయకులు ఇర్రి రమణారెడ్డి, గంగం సతీష్‌రెడ్డి, బాల్నె సిద్దిలింగం, చల్ల శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


