క్షేత్రస్థాయిలో పురోగతితోనే సమాజ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయిలో పురోగతితోనే సమాజ అభివృద్ధి

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

● కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

దేవరుప్పుల : క్షేత్రస్థాయిలో ఆశించిన పురోగతితోనే సమాజ అభివృద్ధికి ఫలాలు వస్తాయని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నమడూరు హైస్కూల్‌తోపాటు ఆయిల్‌ పామ్‌ పంటల సాగును పరిశీలించి పలు సూచనలు చేశారు. తొలుత స్థానిక హైస్కూల్‌ను సందర్శించి హెచ్‌ఏం కళావతితో కలిసి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించి, అక్కడి మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి స్థితిగతులపై చర్చించారు. చెత్తాచెదా రం, పిచ్చిమొక్కలు ఉండటాన్ని గమనించి, వాటిని వెంటనే తొలగించి, విద్యార్థులకు అనువైన పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

ఉద్యాన సాగుపై దృష్టి సారించాలి

రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించే విధంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. చిన్నమడూరు గ్రామంలోని రైతు వంగ వెంకటేశ్వర్లు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి పత్తి సాగు చేస్తున్న విస్తీర్ణం, ఆయిల్‌ పామ్‌ సాగు వివరాలు, చేపల చెరువు విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట డీహెచ్‌ఎస్‌ఓ దేవినర్సయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement