పేదల సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదల సంక్షేమమే లక్ష్యం

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

● స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే

కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌: రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆర్డీఓ కిరణ్‌ప్రకాష్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా నియోజకవర్గంలో రూ.1600 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధి పనులు తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బాబు, ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్‌ స్వప్న, మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ నీల రాజమ్మగట్టయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకృష్ణ, నాయకులు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, బెలిదె వెంకన్న, మంతెన ఇంద్రారెడ్డి, మందపురం అనీల్‌, కిషన్‌రాజ్‌, బూర్ల శంకర్‌, పోశాల కృష్ణ, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement