కాలువ అలైన్‌మెంట్‌ మార్చొద్దు.. | - | Sakshi
Sakshi News home page

కాలువ అలైన్‌మెంట్‌ మార్చొద్దు..

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

జనగామ: మండలంలోని చీటకోడూరు రిజర్వాయర్‌ నుంచి ఎల్లంల వరకు చేపట్టాల్సిన ఇరిగేషన్‌ కాలువ పనులను పునఃప్రారంభించేందుకు అధికా రులు మంగళవారం పట్టణంలోని వికాస్‌నగర్‌లో పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో వికాస్‌నగర్‌లో గతంలో సర్వే చేసిన స్థలం వద్దకు ఆర్డీఓ గోపిరామ్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సీతారాం, ఈఈ ముద్ర, డీఈ మన్మధరావు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ప్లాట్ల యజమానులు అక్కడికి చేరుకుని కాలువ అలైన్‌మెంట్‌ను మొదట రూపొందించిన విధంగానే కొనసాగించాలని అధికారులను కోరారు. సర్వే నంబర్‌ 145లోని 2 ఎకరాల 32 గుంటల భూమిని కాలువ నిర్మాణం కోసం మొదట సేకరించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని గతంలో అధికారులు చెప్పారన్నారని పాట్ల యజమానులు తెలిపారు. అయితే ఆ తర్వాత మొదట రూపొందించిన అలైన్‌మెంట్‌ను పక్కనపెట్టి, కొందరి ప్రయోజనాల కోసం కాలువను మరోవైపు నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము ప్రైవేటుగా సర్వే చేయించగా, మారిన అలైన్‌మెంట్‌ ప్రకారం 3 ఎకరాల 24 గుంటల భూమి కోల్పోవాల్సి వస్తుందని గుర్తించినట్లు వెల్లడించారు. తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా పనులు చేపడితే మరో సారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్డీఓ గోపిరామ్‌ మాట్లాడుతూ కాలువ పనులు, భూసేకరణకు సంబంధించి ఇరిగేషన్‌ అధికారులు స్పష్టమైన నివేదిక అందించాలని సూచించారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ సీతారాం మాట్లాడుతూ ప్లాట్ల యజమానులు తమ సమస్యలను వివరించారని, వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement