● కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
బచ్చన్నపేట: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదల సంక్షేమాన్ని విస్మరించారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతన పింఛన్ మంజూరు పత్రాల అందజేత కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రొటోకాల్‌పై ఉన్న శ్రద్ధ ప్రజాసేవపై లేదని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లావణ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మసూద్, సర్పంచ్ అల్వాల నర్సింగారావు, నాయకులు విద్యానాథ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్, హరీష్, సందీప్, బాల్‌రాజు, శ్రీనివాస్, మల్లారెడ్డి, రమేశ్, ప్రకాష్, మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


