కుటుంబ బీమా పథకం అమలుపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

కుటుంబ బీమా పథకం అమలుపై శిక్షణ

Nov 18 2026 1:20 AM | Updated on Nov 18 2026 1:20 AM

జనగామ రూరల్‌: కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా దరఖాస్తుల నమోదు ప్రక్రియ, కుటుంబ సభ్యుల వివరాల నమోదు, నామినీల ఎంపిక, ఆధార్‌ ధ్రువీకరణ, తదితర అంశాలపై జిల్లా అధికారులకు, ఎంపీడీఓలు, తహసీల్దార్లకు మంగళవారం కలెక్టరేట్‌లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ భాస్కర్‌ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి అర్హులైన కుటుంబాల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అన్ని వివరాల నమోదు పూర్తయిన అనంతరం దరఖాస్తును ప్రింట్‌ తీసుకుని, బీమా పొందే వ్యక్తి, నామినీల సంతకాలు తీసుకోవాలని తెలిపారు. వెబ్‌సైట్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం, కుటుంబ సభ్యుల వివరాల నమోదు, ఆధార్‌ ఈ–కేవైసీ ప్రక్రియ, తదితర అంశాలపై ఈడీఎం గౌతమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement