జనగామ: వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే, వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ పాథాల జీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024 బ్యాచ్ వైద్య విద్యార్థులు సోమవారం ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, మెరుగైన చికిత్స, ఆరోగ్య పరిరక్షణపై ప్రజ లకు వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు వినూత్నంగా రూపొందించిన ప్రదర్శనలను పరిశీలించి, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు వారు చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు డాక్టర్ ఎండీ అన్వర్, డాక్టర్లు జ్యోతి, కౌసల్య, విశ్వనాథ్, శ్రవణ్, సరిత, ఆశా, శీతల్, పవన్ పాల్గొన్నారు.
నేడు పురపాలికలో
కొత్త పింఛన్ల పంపిణీ
జనగామ: మున్సిపాలిటీ పరిధిలో చేయూత సామాజిక భద్రతా పథకం కింద నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 17న (మంగళవారం) నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భూషా పర్వతాలు, వార్డు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొననున్నారన్నారు. నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరుకావాలని కమిషనర్ కోరారు.
గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్లకు
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: జిల్లాలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల్లో 14 మంది గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్లను ఐదు నెలల కాలపరిమితికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని 22న రాతపరీక్ష ఉంటుందన్నారు. గౌరవ వేతనం రూ.16,500 ఇవ్వనున్నట్లు వివిధ కేటగిరిల్లో స్పెషల్ ఎడ్యుకేషన్, బీఎడ్ అర్హత ఉండాలన్నారు.
డ్రగ్స్ పరీక్షల కిట్లకు రూ.లక్ష విరాళం
హసన్‌పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ చేపడుతున్న కార్యక్రమాలకు ఇనుగాల చారిటబు ల్ ట్రస్ట్ తన వంతు సహకారం అందించింది. డ్రగ్స్ పరీక్షల కిట్ల కొనుగోలుకు ట్రస్ట్ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి రూ.లక్ష విరాళం అందించారు. ఈమేరకు సోమవారం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతకు చెక్కును అందజేశారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాల బారినపడకుండా కాపాడడానికై డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించడం, మాదక ద్రవ్యాల విక్రయాలపై నిఘా పెంచడం వంటి చర్యలకు డ్రగ్స్ పరీక్షల కిట్లు ఎంతో అవసరమని గుర్తించి ఈ విరాళాన్ని అందించినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేపటినుంచి మనగుడి కార్తీకమాసోత్సవాలు
హన్మకొండ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్ధానం, హిందూ ధర్మప్రచార పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల 18 నుంచి మనగుడి కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీ డీ కార్యక్రమ బాధ్యుడు రామిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు సోమవారం వరంగల్ రామన్నపేటలోని ఆర్యవైశ్య సంఘం కళ్యాణమండపంలో కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యులు గట్టు మహేష్‌బాబు, నరేందర్ తదితరులు సంబంధిత ప్రచార బ్యానర్ ఆవిష్కరించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ వరంగల్‌లో శ్రీశృంగేరి శంకర మఠం, హనుమకొండలో శ్రీచంద్రమౌళీశ్వర సహిత అభయాంజనేయ స్వామి దేవాలయంలో 18 నుంచి 24 వరకు సప్తాహ ప్రవచనాలు జరుగుతాయన్నారు.


