ఇందిరమ్మ ఇళ్లు.. పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లు.. పింఛన్లు

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

జనగామ రూరల్‌: ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి 298 ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. వితంతు, వృద్ధాప్య పెన్షన్‌లు, ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌కు ప్రజలు తరలివచ్చారు. ఇందులో 60 వరకు ఇందిరమ్మ ఇళ్లకు వినతులు వచ్చాయి. స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజావాణిలో జెడ్పీ సీఈఓ బలరామ రావు, డీఆర్డీఓ భాస్కర్‌, సీపీఓ చిన కోట్యా నాయక్‌, ఎస్‌ఈ ఎన్పీడీసీఎల్‌ సంపత్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి వచ్చే అర్జీల్లో

అత్యధికం ఇవే..

అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

దరఖాస్తుల్లో కొన్ని ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement