ఎట్టకేలకు సద్దుమణిగిన వివాదం | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు సద్దుమణిగిన వివాదం

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు సోమవారం తెరపడింది. మార్కెట్‌ కార్యదర్శి, ఓ వ్యాపా రి మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో కొనుగోళ్లు నిలిచిన విషయం తెలిసిందే. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, మార్కెటింగ్‌ శాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో సమస్య కొలిక్కి వచ్చింది.

నిలిచిన కొనుగోళ్లు

మార్కెట్‌ కార్యదర్శి, ఓ వ్యాపారి మధ్య జరిగిన వివాదం పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేసి నిరసన తెలిపారు. కాగా, కొనుగోళ్ల నిలిపివేతపై వీరు నోటీసు ఇవ్వడంతో కలెక్టర్‌ సత్యశారద ఆది వారం రాత్రి అధికారులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకు ని మార్కెట్‌ను కొనసాగించాలని ఆదేశించారు. అయినా వ్యాపార వర్గాలు మొండికేయడంతో కలెక్టర్‌ ఆదేశాలతో ఏసీపీ వెంకటేష్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు, వ్యాపారులతో ఆయన జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంగళవారంనుంచి యఽథావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని జిల్లా మార్కెటింగ్‌ అధికారి నాగరాజు సోమవారం తెలిపారు.

రైతులకు తప్పని అవస్థలు..

మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయిన విషయం తెలియక జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయ ఉత్పత్తులతో మార్కెట్‌కు చేరుకున్నారు. ప్రధాన గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను అడ్డుకుని లోపలికి అనుమతించకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. మార్కెట్‌లో సరుకులు విక్రయించిన తర్వాతే స్వగ్రామాలకు తిరిగి వెళ్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement