బీమా పథకంలో పొరపాట్లకు తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

బీమా పథకంలో పొరపాట్లకు తావివ్వొద్దు

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

జనగామ రూరల్‌: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఈ నెల 19న ప్రవేశపెట్టనున్నట్లు, అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కుటుంబంలో 18 నుంచి 59 ఏళ్లు కలిగిన సభ్యుల్లో ఒకరికి మాత్రమే ఈ బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు. పథకం అమలులో భాగంగా రెండు రకాల దరఖాస్తుల ప్రక్రియను స్పష్టంగా అర్థం చేసుకోవాలని సూచించారు. రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల వివరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ప్రీ–ఫిల్డ్‌ ఫారమ్‌ల రూపంలో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారులు తాము నివసిస్తున్న ప్రాంతానికి కేటాయించిన క్యాంపులోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. సమీక్షలో జెడ్పీ సీఈఓ బలరామ రావు, సీపీఓ చిన్న కోట్యా నాయక్‌, జనగామ, ఆర్డీఓలు గోపీరాం, కిరణ్‌ ప్రకాష్‌, మున్సిపల్‌ కమిషనర్లు రాజశేఖర్‌ రెడ్డి, రాధాకృష్ణ, డీవీహెచ్‌ఓ మురళీధర్‌ రావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్‌, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ మాధవీలత, డీసీఎస్‌ఓ సురేష్‌ రెడ్డి, డీఆర్డీఓ భాస్కర్‌, డీపీఓ వెంకట్‌ రెడ్డి, అడిషనల్‌ డీఆర్డీఏ సూరి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement