u మరిన్ని ఫొటోలు 8లో
జనగామ: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడిన కోటి సోమవారంగా రావడంతో జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే శి వాలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దులగుట్ట, జనగామ మండలం చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వర స్వామి, జనగామ పట్టణంలోని పాతబీటు బజారు శ్రీ రామలింగేశ్వర స్వామి, గీతాశ్రమం, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర స్వామి, రైల్వే స్టేషన్ ఏరియాలోని శ్రీ సంతోషిమాత, ఉప్పలమ్మ సహిత శ్రీ ఆంజనేయ శివాలయం, బతుకమ్మ కుంట శ్రీ విజయదుర్గ మాత ఆలయంతో పాటు జిల్లా నలుమూలల ఉన్న శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శివలింగాలకు రుద్రాభిషేకాలు చేసి, ఉసిరి చెట్టు కింద లక్ష వత్తుల దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 6.30 గంటల అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశ దీపాలను వెలిగించారు.


