సంక్షేమం, మహిళ సాధికారతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం, మహిళ సాధికారతకు పెద్దపీట

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

జఫర్‌గఢ్‌ : సంక్షేమం, మహిళ సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసిందన్నారు. ఇందుకోసం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమం అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడమేనన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధితో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉండి పింఛన్‌ రాని వారు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, 32 మందికి సీఎంఆర్‌ఎఫ్‌, 37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దేవేందర్‌, ఎంపీడీఓ దయాకర్‌, తహసీల్ధార్‌ శ్రీనివాస్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ తీగల కరుణాకర్‌రావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నూకల ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ ఎంపీ కడియం కావ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement