జనగామ రూరల్: రైతు సంక్షేమ హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని కేంద్ర విధానాలతో వ్యవసాయ రంగం కార్పొరేట్లపరం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విమర్శించారు. ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఆదివారం జనగామ నుంచి నల్లగొండకు రైతు సంఘాల సీపీఎం నాయకులు తరలివెళ్లారు. నల్లగొండలో భారీ బహిరంగ సభ నేపథ్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎండీ అబ్బాస్, మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర విధానాలతో వ్యవసాయ రంగం కార్పొరేట్లపరం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్.రాజు, ఎస్.యాదగిరి, ఆర్.సోమయ్య, ఎస్.రమేశ్, బి.శేఖర్, 3వ వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి, బి.గోపి, జె. ప్రకాష్, ఎస్.విజేందర్, బి.గణేష్, ఎం.రమేశ్, బి. వెంకటేష్, జి.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి


