రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ఆరుతడి పంటలే మేలు

రైతులు తమకు ఆసక్తి ఉన్న ప్రత్యామ్నాయ పంటలు, సాగు విస్తీర్ణం, నీటి పారుదల పరికరాలు, సోలార్‌ ఫెన్సింగ్‌, పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్ల అవసరాలను నిర్ణీత గడువులోగా గ్రామ క్లస్టర్‌ ఏఈఓల ద్వారా నమోదు చేయించుకోవాలి. పంటల వైవిధ్యీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, శాఖల సమన్వయంతో రైతుల ఆదాయం పెంచడం, సాగు ఖర్చులు తగ్గించడం, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి సాధించడం లక్ష్యం.

– సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి. నీటి వనరులు, భూముల స్వభావానికి అనుగుణంగా ఆరుతడి పంటలను ఎంచుకోవాలి. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి. రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం, అవసరమైన సదుపాయాలు అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

– అంబికా సోనీ, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement