బిర్సాముండా పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

బిర్సాముండా పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

జనగామ రూరల్‌: భగవాన్‌ బిర్సా ముండా జీవి తం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగవాన్‌ బిర్సాముండా 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గిరిజనుల సంప్రదాయాలు, జీవన విధానాల్లో మార్పులు తీసుకురావడానికి ఆచారాలు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి బిర్సాముండా నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, బంజారా కమ్యూనిటీ ఛైర్మన్‌ డా.లక్ష్మీనారాయణ నాయక్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి హసీనా బేగం, అనిత వంకుడోత్‌, స్వామినాయక్‌, కొర్ర స్వరూప రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement