● మున్సిపల్ చైర్‌పర్సన్
కడకంచి బాలమణి శ్రీనివాస్
● వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్
జనగామ: పతిఒక్కరూ వ్యక్తిగత జీవితంలో శారీరక, మానసిక దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి అన్నారు. శనివారం వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రన్ ఫర్ నేచర్–రన్ ఫర్ ఫ్యూచర్ 5కే రన్ బతుకమ్మకుంట నుంచి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు సాగింది. వాస్విక్ ఫౌండేషన్ ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది పాల్గొని ప ర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు ప్రకటించారు. మొదటగా మొక్కలు నాటిన అనంతరం 5కే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలను నిత్యజీవితంలో భాగం చేసుకోవా లన్నారు. సీఐ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ వాస్విక్ ఫౌండేషన్ గత ఆరేళ్లుగా అనేక వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. 5కే రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతీఒక్కరి సామాజిక బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సేవా ప్రతి నిధులు మహేందర్‌వర్మ, నూకల నర్సిరెడ్డి, రమేష్ రెడ్డి, భూపాల్‌రెడ్డి, వేలాద్రి, యాకూబ్, వికాస్‌రెడ్డి, నవీన్, శ్రీశైలం, పీడీలు చందు, కిషన్, రాంరెడ్డి, ఆర్‌కే, సాయి కిరణ్‌రెడ్డి, డీజే అశోక్, వాకర్స్, రన్న ర్స్ అసోసియేషన్ సభ్యుల పాల్గొన్నారు.


