గ్రంథాలయాల అభివృద్ధికి నూతన భవనాలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాల అభివృద్ధికి నూతన భవనాలు

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

● జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్‌ రాంబాబు

జనగామ: జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనంతో పా టు స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గఢ్‌ గ్రంథాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మారుజోడు రాంబాబు తెలిపారు. శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆ విష్కరించి వారోత్సవాలను ప్రారంభించారు. అ నంతరం నెహ్రూ, గ్రంథాలయ పితామహుడు ఎస్‌.ఆర్‌. రంగనాథన్‌, సరస్వతీదేవి చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రంథాలయాల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు వంగ ఉమాయుగేందర్‌, రజనీక్రాంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.సుధీర్‌, టి.మధుసూదన్‌రెడ్డి, సీహెచ్‌. రవి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement