సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

బచ్చన్నపేట: దర్జీ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న టైలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టైలర్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ గాలి తిరుపతి అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ దర్జీ వృత్తిలో సరైన ఉపాధి లేక చాలా మంది అవస్థలు పడుతున్నారని, కుట్టు యంత్రాలు వచ్చి పొట్టగొడుతున్నాయన్నారు. అర్హత కలిగిన ప్రతీ టైలర్‌కు ఇందిరమ్మ ఇళ్లు, వైద్యసదుపాయం, సబ్సిడీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంధమల్ల మల్లేష్‌, కార్యదర్శి రాపెల్లి జనార్దన్‌, నాయకులు ఇరుగు పైడి, బాల్‌నర్సయ్య, సత్యనారాయణ, నర్సింగారావు, అబ్బయ్య, సుధాకర్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

● టైలర్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement