రీ సర్వే పనుల్లో పారదర్శకత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే పనుల్లో పారదర్శకత పాటించాలి

Nov 15 2026 1:08 PM | Updated on Nov 15 2026 1:08 PM

నర్మెట (తరిగొప్పుల): భూముల రీ సర్వేలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) బెన్‌షాలోమ్‌ అన్నారు. నర్సాపూర్‌లో నిర్వహిస్తున్న రీ సర్వేను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏడీ (సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌) మన్యంకొండ, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ కురికాల వే ణు, డీఐ, సర్వే బృందం, రైతులు పాల్గొన్నారు.

నెహ్రూ సేవలు చిరస్మరణీయం

జనగామ: భారత తొలి ప్రధానమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆధునిక భారత దేశ నిర్మాత పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలను శనివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ పారిశ్రామిక, విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి నెహ్రూ చేసిన కృషి మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎర్రమల్ల సుధాకర్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు వంగల కళ్యాణి మల్లారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌ చందర్‌, వేముల మల్లేష్‌, జయ మల్లేష్‌, మాజిద్‌ అఫ్సర్‌, తదితరులు పాల్గొన్నారు.

పంటల మార్పిడిపై

అవగాహన కల్పించాలి

● డీఏఓ అంబికాసోని

స్టేషన్‌ఘన్‌పూర్‌: గ్రామాల్లో రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పించేలా ఏఓలు, ఏఈఓలు క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికాసోని అన్నారు. ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిఽధిలోని ఛాగల్లు రైతువేదికలో పంటల మార్పిడి ప్రణాళికల తయారీపై వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌, ఉద్యానశాఖ డైరెక్టర్‌లచే జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీఏఓ అంబికాసోని, జిల్లా ఉద్యానశాఖ అఽధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వీసీ అనంతరం డీఏఓ మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో రైతులకు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. స్థానిక వాతావరణ, సాగు పరిస్థితులకు అనుగుణంగా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఘన్‌పూర్‌ ఏఓ కరుణాకర్‌, ఏఈఓలు పాల్గొన్నారు.

సామాజిక న్యాయ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం

కాజీపేట అర్బన్‌ : సామాజిక న్యాయ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకమైందని తెలంగాణ సీనియర్‌ సిటిజన్స్‌ కమిషన్‌ ముఖ్య కమిషనర్‌, జస్టిస్‌ ఈద తిరుమలాదేవి తెలిపారు. హంటర్‌రోడ్డులోని డీ కన్వెన్షన్‌ హాల్‌లో శనివారం ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ 6వ రాష్ట్ర సదస్సుకు ముఖ్యఅతిథిగా జస్టిస్‌ తిరుమలాదేవి హాజరై మాట్లాడారు. ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో గౌరవంగా జీవించే హక్కు కూడా ఉందని, ఇంటినుంచి గెంటివేతకు గురవుతున్న వృద్ధులకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలుగు అకాడమీ చైర్మన్‌ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూ పుమాపి సమానత్వ సమాజ నిర్మాణంలో న్యా య వాదులు ముందుంటారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా జడ్జిలు ఎంఆర్‌ సునీత, మైత్రేయి, మెట్టుపల్లి సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ దయ రాజారాం, దాసురాం నాయక్‌, ఎన్‌జె.శాంసన్‌, సాయిని నరేందర్‌, తీగల జీవన్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement