● ప్రభుత్వ ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం
పాలకుర్తి టౌన్: మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ పిట్టల దొర వేషధారణతో రాష్ట్రవ్యాప్తంగా సామాజిక చైతన్య ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శనివారం పాలకుర్తి మండలకేంద్రం రాజీవ్ చౌరస్తాలో మైకుతో మత్తు పదార్థాలు–అనర్థాలు, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై అవగాహన కల్పించారు. ‘నో డ్రగ్స్–సేవ్ లైఫ్’ అంటూ కరపత్రాలు పంపిణీ చేసి మైక్‌లో మాట్లాడుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు.


