ఆర్టీసీ ఎంఎస్‌టీతో ప్రయాణికులకు లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎంఎస్‌టీతో ప్రయాణికులకు లాభాలు

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

జనగామ రూరల్‌: ఆర్టీసీలో ఎంఎస్‌టీ(మంత్లీ సీజన్‌ టికెట్‌)తో మరిన్ని లాభాలు చేకూరుతాయని డిపో మేనేజర్‌ ఎం.ఉష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ప్రయోజనాలను వివరించారు..100 కిలో కిలోమీటర్లు పైగా కూడా సీజన్‌ టికెట్‌ ద్వారా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. 20 రోజుల చార్జీతో 30 రోజుల ప్రయాణం, 40 రోజుల చార్జీతో 65 రోజు ల ప్రయాణం, 90 రోజుల చార్జీతో 100 రోజుల ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నారు. అలాగే టోల్‌చార్జీలలో రాయితీ, ఆదివారాలలో సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. డీలక్స్‌ బస్సులకు కూడా టికెట్‌ అవకాశం ఉందన్నారు. పల్లె వెలుగులో ఎంఎస్‌టీ టికెట్‌ తీసుకున్న వారికి ఎక్స్‌ప్రెస్‌ బస్సులో, ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ తీసుకున్న వారికి డీలక్స్‌ బస్సులో 20 రూపాయలు కాంబి టికెట్‌ ద్వారా ప్రయాణం చేయవచ్చన్నారు. రూటులో కాకుండా వేరే రూట్‌లో ప్రయాణం చేసినప్పుడు సూపర్‌ లగ్జరీ ఆపై బస్సులో టెన్‌ పర్సెంట్‌ రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సీజన్‌ టికెట్‌ రెండు నెలలకు గాను ఒక్కసారిగా తీసుకుంటే అదనంగా ఐదు రోజులు ప్రయాణం చేయవచ్చన్నారు. మహిళా ప్రయాణికులకు డీలక్స్‌ బస్సుల్లో 30 రోజులకు గాను 15 రోజుల చార్జీలు మాత్రమే వసూలు చేస్తారన్నారు.

కత్తిసాములో త్రివేణికి

గోల్డ్‌ మెడల్‌

జఫర్‌గఢ్‌: మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన తాళ్లపల్లి త్రివేణి అనే విద్యార్థిని కత్తిసాము (ఫెన్సింగ్‌) పోటీల్లో ప్రతిభను చూపి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. విద్యార్థిని త్రివేణి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారణాసిలో స్పోర్ట్స్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ఇటీవల హైదరాబాద్‌లోని హకీంపేటలో జరిగిన ఖేలో ఇండియా అస్మిత లీగ్‌ ఫెన్సింగ్‌ సౌత్‌ జోన్‌ క్రీడలో భాగంగా నిర్వహించిన కత్తి సాము పోటీల్లో త్రివేణి పాల్గొని ప్రతిభను చాటి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఈసందర్భంగా విద్యార్థినికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement