యాసంగి సీజన్‌కు ముందస్తు చర్యలు | - | Sakshi
Sakshi News home page

యాసంగి సీజన్‌కు ముందస్తు చర్యలు

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

● సమీక్షలో ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి

జనగామ: రానున్న యాసంగి (రబీ) సీజన్‌లో రైతులకు, ఇతర విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జనగామ విద్యుత్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) సంపత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సర్కిల్‌ కార్యాలయంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితి, చేపట్టిన అభివృద్ధి పను ల పురోగతి, రానున్న యాసంగి సీజన్‌ సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ అందించడం, విద్యుత్‌ పొదుపుపై వినియోగదారులకు అవగాహన కల్పించడం, విద్యుత్‌ లైన్ల నిర్వహ ణ, ముందస్తు మరమ్మతులపై చర్చించారు. అనంత రం ఎస్‌ఈ మాట్లాడుతూ.. విద్యుత్‌ అంతరాయాలను కనిష్ట స్థాయికి తగ్గించడంతో పాటు, సరఫరా లో సమస్యలు తలెత్తిన వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదా రుల విద్యుత్‌ సమస్యలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నూతన విద్యుత్‌ సర్వీసులను నిర్ణీత సమయంలో విడుదల చేయాలని సూ చించారు. సమావేశంలో డివిజనల్‌ ఇంజనీర్లు అని ల్‌, లక్ష్మీనారాయణరెడ్డి, సారయ్య, ఎస్‌ఏఓ శంకర్‌, అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement