బీమా పథకాలతో బాధిత కుటుంబాలకు ధీమా | - | Sakshi
Sakshi News home page

బీమా పథకాలతో బాధిత కుటుంబాలకు ధీమా

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

దేవరుప్పుల : వేగవంతమైన జీవన మనుగడలో అనివార్యంగా పొందాల్సిన బీమా పథకాలు సజావుగా కొనసాగిస్తే బాధిత కుటుంబాలకు భవిష్యత్తులో ధీమాగా మారుతాయని ఆర్బీఐ డీజీఎం దేవ్‌ ప్రియ సూచించారు. శుక్రవారం మండలంలోని నీర్మాలలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌, విడ్స్‌ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జన సురక్ష క్యాంప్‌ సదస్సుకు సర్పంచ్‌ పల్లెర్ల సంధ్యారాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీజీఎం మాట్లాడుతూ.. ప్రతీ బ్యాంకు ఖాతాదారులు ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలులో ఉన్న బీమా పథకంలో చేరి కుటుంబ ప్రయోజన కోసం పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం రాములు , ఎస్‌బీఐ ఆర్‌ఎం సుబ్బారావు, టీజీబీ ఆర్‌ఎం ఉదయ్‌,ఎల్‌డీఎం ప్రతిభ, నాబార్డ్‌ డీడీఎం విజయ్‌ కుమార్‌, స్థానిక టీజీబి,యుబీఐ, డీసీసీబీ బ్యాంకు మేనేజర్లు శ్రీనివాస్‌నాయక్‌, పవన్‌కుమార్‌,గణేష్‌, సంతోష్‌, రవివర్మ,స్వాతి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

ఆర్బీఐ డీజీఎం దేవ్‌ ప్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement