గీతాశ్రమంలో పూజలు చేస్తున్న భక్తులు
పోచమ్మఆలయం పుట్టవద్ద భక్తుల పూజలు
జనగామ: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నాగుల చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే శివాలయాలు, నాగదేవత పుట్టల వద్ద భక్తుల సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని గీతాశ్రమం, పోచమ్మ టెంపుల్, బతుకమ్మ కుంట, శ్రీ విజయదుర్గామాత, శ్రీ సంతో షిమాత, పాతబీడు బజారులోని శ్రీ రామలింగేశ్వర స్వామి, గుండ్లగడ్డలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాలతో పాటు పలు దేవాలయాలకు వందలాది మంది భక్తులు తరలివచ్చి పూజలు చేశారు.


