రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలి

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

జనగామ రూరల్‌: రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించాలని సేంద్రీయ ధ్రువీకరణ, మార్కెటింగ్‌ విధానాలపై రైతులకు వివరించాలని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) అంబికా సోనీ అన్నారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయంపై కృషిసఖీలకు ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డీఆర్డీఓ ఆర్‌.భాస్కర్‌, డీఏఓ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ..ప్రతి కృషిసఖీ తమ పరిధిలో 125 మంది రైతులను ఎంపిక చేసుకుని వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలన్నారు. డీఆర్‌డీఓ మాట్లాడుతూ.. ప్రతి కృషి సఖీ తమ పరిధిలోని మహిళా సంఘాల గ్రామ సంస్థల సమావేశాల్లో చర్చించి, సంఘ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ నూరుద్దీన్‌, ఏడీఏ వసంత సుగుణ, డీపీఎం నళిని, మారి సంస్థ ప్రతినిధులు మారపాక వెంకటస్వామి, గాండ్ల రాజు, చాగంటి నరేష్‌, వెంకట వంశీ, రావుల రాజేందర్‌తో కృషి సఖీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement