నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యం

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

● ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి

స్టేషన్‌ఘన్‌పూర్‌: వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ చెరుకు సంపత్‌రెడ్డి అన్నారు. మండలంలోని సముద్రాల గ్రామ శివారులోని నారాయణపురంలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం ఘన్‌పూర్‌ డీఈ సారయ్యతో కలిసి నారాయణపురంలో భూసర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. సముద్రాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో లో ఓల్టేజీ, ఓవర్‌లోడ్‌ సమస్యలు లేకుండా ప్రస్తుతం ఉన్న ఇప్పగూడెం, గుంటూరుపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లకు తోడుగా నారాయణపురంలో మరో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించామన్నారు. కార్యక్రమంలో ఏడీఈ రణధీర్‌రెడ్డి, సామిరెడ్డి, ఏఈ శివకుమార్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ కాలురామ్‌నాయక్‌ పాల్గొన్నారు.

లా పరీక్షల నిర్వహణ పరిశీలన

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల 5, 6వ సెమిస్టర్ల పరీక్షలు ఐదేళ్ల లా కోర్సు 9, 10 సెమిస్టర్ల అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం యూనివర్సిటీలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెంటర్‌ను పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆయనవెంట ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ నర్సింహాచారి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement