ఎన్నికల విధానంపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధానంపై అవగాహన ఉండాలి

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: పాఠశాల, కళాశాలల స్థాయి విద్యార్థులు సార్వత్రిక ఎన్నికల విధానంపై అవగాహన కల్గి ఉండాలని ఆర్‌డీఓ కిరణ్‌ప్రకాశ్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ఎస్‌లో నియోజకవర్గస్థాయి ఎలక్ట్రోరల్‌ లిటరసీ క్లబ్స్‌ వ్యాసరచన, క్విజ్‌ పోటీలను గురువారం నిర్వహించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంఈఓ కె.రమేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గఢ్‌, చిల్పూరు, రఘునాఽథపల్లి, లింగాలఘణపురం మండలాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కాగా, వ్యాసరచన, క్విజ్‌ పోటీలను నిర్వహిస్తున్న తీరును ఆర్‌డీఓ పరిశీలించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం సంపత్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఆర్డీఓ కిరణ్‌ప్రకాశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement