అబుల్‌ కలాం జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

అబుల్‌ కలాం జీవితం ఆదర్శనీయం

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

● కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జనగామ రూరల్‌: విద్యా వైతాళికుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబుల్‌ కలాం చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్‌చార్జ్‌ అధికారి మురళీధర్‌రావు, మైనార్టీ చైర్మన్‌ మాజిద్‌ అప్సర్‌, సభ్యులు ఖాదర్‌షరీఫ్‌, ఇస్మాయిల్‌, జబ్బార్‌, మోసిన్‌ అబ్బాస్‌, ఐడీఓసీ సిబ్బంది, మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఆజాద్‌ ఆశయాలను కొనసాగించాలి

జనగామ: భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ మైనారిటీ విభాగం, పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆజాద్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి, కౌన్సిలర్‌ ఉడుగుల కిష్టయ్య, నాయకులు బాల్దె సిద్దిలింగం, ఇరు గు సిద్దులు, ఉల్లెంగుల సందీప్‌, రామకృష్ణ, బండ యాదగిరిరెడ్డి, మైనార్టీ అధ్యక్షులు ఎండీ సలీం, పాషా, సాజిద్‌, యూకూబ్‌పాషా, అన్వర్‌, గులామ్‌, మోహినొద్దీన్‌, అమీర్‌, రిజ్వాన్‌, తహసీన్‌, మసూద్‌ తదితరులు పాల్గొన్నారు.

భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

● వీసీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

జనగామ రూరల్‌: భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూల వాతావరణంలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌ నుంచి అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా హాజరయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా ప్రతీ జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్ష లేని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైన కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఆర్డీఓలు గోపీరాం, కిరణ్‌ ప్రకాష్‌, సర్వే అండ్‌ ల్యాండ్స్‌ ఏడీ మన్యంకొండ, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: లింగాల ఘణపురం మండలంలోని నేలపోగుల గ్రామంలోని పీఎంశ్రీ రత్నమాల కేసరి ఎంపీయూపీఎస్‌లో ఇంగ్లిష్‌, గణిత సబ్జెక్టులకు ఇద్దరు టీచర్లను స్పాన్సర్‌షిప్‌ ప్రాతిపదికన నియమించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టుతో పాటు టీటీసీ, బీఎడ్‌ అర్హత కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు ధ్రువపత్రాలతో 13వ తేదీ సాయంత్రం 4:00 గంటల వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15న ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్‌లో ఎంపిక పరీక్ష ఉంటుందన్నారు. ఎంపికై న అభ్యర్థులకు పారితోషికం రత్నమాల కేసరి సంస్థ ద్వారా చెల్లించబడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement