లింగాలఘణపురం: జిల్లాలో గత యాసంగి(రబీ) సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సివిల్ సప్లై శాఖ ఇచ్చే కమీషన్ ఇప్పటికీ అందకపోవడంతో వారికి ఎదురుచూపులే మిగిలాయి. గత యాసంగి సీజనల్‌లో జిల్లాలోని 12 మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 171 కొనుగోలు కేంద్రాల్లో 17,67,860.8 క్వింటాళ్లు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 60 కేంద్రాల్లో 6,69,798.8 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అందుకు క్వింటాల్‌కు సివిల్ సప్లై శాఖ నుంచి కేంద్ర నిర్వాహకులకు రూ.31 కమీషన్ ఇస్తుంది. అంటే జిల్లాలో మొత్తం ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు సుమారుగా రూ.4,94,64,942, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలకు రూ.2,07,63,762 సుమారుగా రూ.7,02,28,704 కమీషన్ల రూపంలో రావాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన కమీషన్ లెక్కలన్నీ సంబంధిత శాఖకు పంపినట్లు అధికారులు తెలుపుతున్నారు. కాని ఇంకా కమీషన్ మాత్రం రాలేదు. ఈ విషయంపై సివిల్ సప్లై డీఎం హతీరామ్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
వచ్చిన కమీషన్ పంపిణీ ఇలా..
క్వింటాల్‌కు రూ.31 చొప్పున ఇచ్చే కమీషన్‌లో 90 శాతం డబ్బులు వీఓలకు మిగిలిన పది శాతంలో జిల్లా సమాఖ్యకు 5 శాతం, మండల సమాఖ్యకు 4 శాతం, మిగిలిన 1 శాతం శిక్షణ కార్యక్రమాలు, ఇతర ఖర్చులకు వినియోగించబడుతుంది. వీఓలకు ఇచ్చిన 90 శాతం కమీషన్‌లో కేంద్రం నిర్వాహకులకు 40 శాతం ఇచ్చి మిగిలిన 50 శాతం వీఓల అకౌంట్లలో జమ చేస్తారు. లేదా సీ్త్రనిధిలో జమ చేసి సంఘం సభ్యులు రుణాలుగా తీసుకుంటారు. అదేవిధంగా పీఏసీఎస్‌ల కేంద్రాలకు వచ్చే కమీషన్ కేంద్ర నిర్వహణ ఖర్చులు మినహా మిగిలిన డబ్బులు సొసైటీ ఖాతాలో జమ చేస్తారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ఎదురుచూపులు
జిల్లాలో రూ.7 కోట్లకు పైగా పెండింగ్
మళ్లీ ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు


